Kamal Haasan: కరోనా బారిన పడిన కమల్ హాసన్

Kamal Haasan tested corona positive
  • ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన కమల్
  • దగ్గుతో బాధపడుతుండడంతో కరోనా పరీక్షలు
  • పాజిటివ్ వచ్చిందని వెల్లడించిన కమల్
  • ఆసుపత్రిలో చేరినట్టు వివరణ
నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) రాజకీయ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని కమల్ హాసన్ వెల్లడించారు. కొన్నిరోజుల కిందట అమెరికా వెళ్లానని, తిరిగి వచ్చిన తర్వాత దగ్గు వస్తుండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు.

కరోనా ఉందని వైద్యులు చెప్పడంతో ఆసుపత్రిలో చేరానని వివరించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కమల్ పిలుపునిచ్చారు.
Kamal Haasan
Corona Virus
Positive
MNM
Tamilnadu
Kollywood

More Telugu News