YCP: ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు

YCP candidates files nominations for MLC elections
  • ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • డిసెంబరు 10న పోలింగ్
  • రేపటితో నామినేషన్లకు తుది గడువు
  • కృష్ణా జిల్లాలో తలశిల రఘురాం, అరుణ్ కుమార్ నామినేషన్లు
  • ప్రకాశం జిల్లాలో తూమాటి నామినేషన్ దాఖలు
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబరు 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు (నవంబరు 23) నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో, వైసీపీ అభ్యర్థులు పలువురు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. కృష్ణా జిల్లాలో తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్ లు భారీ సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు వారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ప్రకాశం జిల్లాలో వైసీపీ తరఫున తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరాం తదితరులు ఉన్నారు.
YCP
MLC Elections
Local Body Quota
Andhra Pradesh
YSRCP

More Telugu News