'శేఖర్' ఫస్టు గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!

22-11-2021 Mon 11:57
  • రాజశేఖర్ కథానాయకుడిగా 'శేఖర్'
  • దర్శకుడిగా లలిత్ పరిచయం
  • డిఫరెంట్ లుక్ ను ట్రై చేసిన రాజశేఖర్
  • ఈ నెల 25వ తేదీన ఫస్టు గ్లింప్స్
Sekhar first Glimpse release on 25th November
రాజశేఖర్ కి చాలా కాలం తరువాత 'గరుడ వేగ'తో భారీ హిట్ పడింది. దాంతో ఆయనలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత ఆయన 'కల్కి' వంటి భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అది ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఆ మధ్య రాజశేఖర్ తన పుట్టినరోజున మూడు సినిమాలను ఎనౌన్స్ చేశాడు.

ఆ మూడు సినిమాల్లో 'శేఖర్' ఒకటి. లలిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఎమ్. ఎల్. వి సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన రాజశేఖర్ ఫస్టు లుక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నెరిసిన గెడ్డం మీసాలతో .. పెద్దగా మేకప్ లేకుండా వదిలిన ఆయన లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.

ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఫస్టు గ్లింప్స్ తో అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి..