హీరోయిన్ గా సాయిపల్లవి సిస్టర్ ఎంట్రీ!

22-11-2021 Mon 10:51
  • సాయిపల్లవి సిస్టర్ పేరు పూజ కన్నన్ 
  • సిల్వా దర్శకత్వంలో 'చితిరై సెవ్వానం'
  • తండ్రీ కూతుళ్ల చుట్టూ తిరిగే కథ
  • డిసెంబర్ 3 నుంచి జీ 5 తమిళంలో
Pooja Kannan in Silva Movie
సాయిపల్లవి తెరపై కనిపించినప్పుడు .. పెద్ద అందగత్తేమీ కాదు, ఒక మోస్తరుగా ఉందని అనుకున్నారు. సినిమా పూర్తయ్యేసరికి ఆమె అభిమానులుగా మారిపోయి థియేటర్లలో నుంచి బయటికి వచ్చారు. తన సహజమైన నటనతో అంతగా ఆమె ఆకట్టుకుంది. తమిళంలోనే కాకుండా, 'ఫిదా' .. 'లవ్ స్టోరీ' వంటి సినిమాలతో తెలుగులోను స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక ఇప్పుడు సాయిపల్లవి చెల్లెలు పూజ కన్నన్ కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది .. అదీ ఒక తమిళ సినిమా ద్వారా. యాక్షన్ కొరియోగ్రఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న 'సిల్వా' .. దర్శకుడిగా 'చితిరై సెవ్వానం' అనే సినిమాను రూపొందించాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ ఈ కథ నడుస్తుంది.

తండ్రి పాత్రలో సముద్రఖని .. కూతురు పాత్రలో పూజ కన్నన్ కనిపించనున్నారు. అమృత స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. జీ 5 తమిళంలో ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాతో, సాయిపల్లవి మాదిరిగానే పూజ కన్నన్ దూసుకుపోతుందేమో చూడాలి.