మెగాస్టార్ ను మెప్పించిన 'భీష్మ' డైరెక్టర్?

  • 'ఛలో' సినిమాతో ఫస్టు హిట్ 
  • 'భీష్మ' హిట్ తో గుర్తింపు 
  • చిరూ నుంచి గ్రీన్ సిగ్నల్ అంటూ టాక్
  • త్వరలో రానున్న స్పష్టత  
Venky Kudumula movie update

తెలుగులో ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి, యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసినవాడిగా వెంకీ కుడుముల కనిపిస్తాడు. నాగశౌర్య హీరోగా ఆయన చేసిన 'ఛలో' .. నితిన్ హీరోగా తెరకెక్కించిన 'భీష్మ' సినిమా భారీ విజయాలను అందుకున్నాయి. నాన్ స్టాప్ గా ఈ సినిమాలు ఎంటర్టైన్ చేశాయి

ఆ తరువాత ఆయన వరుణ్ తేజ్ తో ఒక కథను అనుకున్నాడు గానీ, ఎందుకో అది కార్యరూపాన్ని దాల్చలేదు. తాజాగా ఆయన చిరంజీవికి ఒక కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడనే టాక్ మాత్రం వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' షూటింగులో ఉన్నారు. రీసెంట్ గా 'భోళా శంకర్' సినిమాను కూడా పట్టాలెక్కించారు.

ఆ తరువాత ఆయన బాబీ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా తరువాత మారుతి ప్రాజెక్టు ఉండవచ్చు. మెగాస్టార్ నుంచి తనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. తాజా ప్రచారంలో నిజమే ఉంటే, ఇవన్నీ పూర్తయిన తరువాతనే వెంకీ కుడుములతో సినిమా ఉండొచ్చునేమో.

More Telugu News