చంద్రబాబును అవమానించడంపై కలత.. మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ అనితాదీప్తి రాజీనామా

22-11-2021 Mon 10:01
  • టీడీపీ సీనియర్ నేత దుద్యాల జయచంద్ర కుమార్తే అనితాదీప్తి
  • ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేకే రాజీనామా అన్న అనిత
  • రైల్వే కోడూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి
MEPMA Employee Anitha Deepthi Resigns her post over Chandrababu row
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో జరిగిన అవమానంపై కలత చెందిన టీడీపీ సీనియర్ నేత, శాప్ మాజీ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర కుమార్తె అనితాదీప్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మెప్మాలో టౌన్ మిషన్ కోఆర్డినేటర్‌గా 2014లో ఉద్యోగంలో చేరిన ఆమె నిన్న రైల్వేకోడూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి అసెంబ్లీలో జరిగిన అవమానం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. త్వరలోనే తన రాజీనామాను ఉన్నతాధికారులకు అందించనున్నట్టు అనితాదీప్తి చెప్పారు.