వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు

22-11-2021 Mon 10:00
  • చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు
  • రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు
  • ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్
Chandrababu to visit flood affected areas
భారీ వర్షాలతో ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా పశువులు వరదప్రవాహంలో కొట్టుకుపోయాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు కడప జిల్లాలో... ఎల్లుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారని చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.