Rohit Sharma: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుగొట్టిన రోహిత్ శర్మ

  • 30 సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన రోహిత్
  • ఈ జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ
  • అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గానూ రోహిత్ రికార్డు
Rohit Sharma breaks Virat Kohlis record

భారత జట్టు టీ20 ఫుల్‌టైం కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ గత రాత్రి న్యూజిలాండ్‌తో కోల్‌కతాలో జరిగిన చివరి టీ20లో అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు. ఈ అర్ధ సెంచరీతో కోహ్లీ రికార్డు బద్దలైంది. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌కు ఇది 30వ అర్ధ సెంచరీ. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి.

రోహిత్ తాజా అర్ధ సెంచరీతో టీమిండియా టీ20 మాజీ సారథి కోహ్లీ రెండో స్థానానికి దిగజారాడు. కోహ్లీ మొత్తం 95 మ్యాచుల్లో 52.04 సగటుతో 3,227 పరుగులు సాధించాడు. ఇందులో 29 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు రోహిత్ 119 మ్యాచుల్లో 30 సార్లు 50కిపైగా పరుగులు సాధించి కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. అయితే, పరుగుల (3,197) విషయంలో మాత్రం కోహ్లీ వెనకే ఉన్నాడు.

అంతేకాదు, రోహిత్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. టీ20ల్లో 150 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో 165 సిక్సర్లతో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

More Telugu News