నల్లగా ఉందని విడాకులిచ్చిన భర్త.. కేసు పెట్టిన భార్య!

22-11-2021 Mon 09:39
  • మార్చిలో ఆలం అనే వ్యక్తితో బాధితురాలికి వివాహం
  • కట్నం కింద మూడెకరాలు ఇచ్చిన బాధితురాలి తండ్రి
  • అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు
Husband gives divorce to his wife for black colour
భార్య నల్లగా ఉందనే కారణంతో ఆమెకు భర్త విడాకులిచ్చిన దారుణం ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. దీంతో, భర్తపై బాధితురాలు కేసు పెట్టింది. వీరిద్దరికీ తొమ్మిది నెలల క్రితమే పెళ్లికావడం గమనార్హం. తాను నల్లగా ఉన్నానని తన భర్త, అత్తింటివారు తనను హేళన చేస్తున్నారని, హింసిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 7న బాధిత మహిళకు ఆలం అనే వ్యక్తితో వివాహం జరిగింది. కట్నం కింద సుమారు మూడెకరాలు కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కావాలంటూ ఆమెను భర్త, అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. బాధితురాలి తండ్రి వద్ద మిగిలిన భూమిని కూడా అమ్మేసి రూ. 10 లక్షలు తీసుకురావాలని... దీంతో కారు కొనుక్కుంటామని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో పలుమార్లు ఆమెపై దాడి చేశారు. ఆ తర్వాత నల్లగా ఉందని చెపుతూ భర్త తలాక్ చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసినట్టు ఇన్స్ పెక్టర్ రాజీవ్ సింగ్ తెలిపారు.