పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మద్దతు

22-11-2021 Mon 07:55
  • ఏపీ రాజధాని విషయంలో మారిన బీజేపీ వైఖరి
  • తిరుపతి పర్యటనలో ఏపీ నేతలకు తలంటిన అమిత్ షా
  • త్వరలోనే ఏపీ వెళ్లి రైతులను కలవనున్న బండి సంజయ్
telangna bjp chief bandi sanjay to meet ap capital farmers soon
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తర్వాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు ఇప్పటికే ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. తాజాగా బండి సంజయ్ వారికి అండగా నిలిచారు. త్వరలోనే ఆయన రాజధాని రైతులను కలవనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ వెళ్లి రైతుల్ని కలిసి సంఘీభావం తెలపాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.