కైకాల సత్యనారాయణకు వాసో ప్రెజర్ సాయంతో చికిత్స

21-11-2021 Sun 22:02
  • తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కైకాల
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • నేడు స్పృహలోకి వచ్చిన వైనం
  • పరిస్థితి విషమంగానే ఉందని తాజా బులెటిన్ లో వెల్లడి
Actor Kaikala Satyanarayana still in ICU
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తీవ్ర అస్వస్థతతో ఆయన ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. నిన్న విషమ పరిస్థితుల్లో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కాగా, నేడు కైకాల స్పృహలోకి వచ్చారు.

తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. రక్తపోటు (బీపీ) స్థాయి చాలా తక్కువగా ఉండడంతో, రక్తపోటును సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు వాసో ప్రెజర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నట్టు బులెటిన్ లో వెల్లడించారు. ఆయన స్పృహలోనే ఉన్నారని, పరిస్థితి విషమంగానే ఉన్నందున ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు.