మూడో టీ20: న్యూజిలాండ్ పై టీమిండియా భారీ స్కోరు

21-11-2021 Sun 20:59
  • ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 రన్స్
  • రోహిత్ శర్మ ఫిఫ్టీ
  • రాణించిన కిషన్, శ్రేయాస్, వెంకటేశ్, చహర్, హర్షల్
  • శాంట్నర్ కు 3 వికెట్లు
Team India posted huge total against New Zealand at Eden Gardens
ఈడెన్ గార్డెన్స్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధసెంచరీతో రాణించాడు. రోహిత్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు.

ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేశ్ అయ్యర్ 20, దీపక్ చహర్ 21 నాటౌట్, హర్షల్ పటేల్ 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోథీ, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గుసన్ తలో వికెట్ తీశారు.