చంద్రబాబును పరిస్థితి పట్ల ఫోన్లో విచారం వ్యక్తం చేసిన సోనూ సూద్

21-11-2021 Sun 20:44
  • అసెంబ్లీలో తీవ్ర పరిణామాలు జరిగాయన్న చంద్రబాబు
  • తన భార్యను దూషించారని ఆవేదన
  • చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన సోనూ
  • హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని వెల్లడి
Sonu Sood talks to Chandrababu on recent developments
అసెంబ్లీలో తీవ్ర పరిణామాల మధ్య వాకౌట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, అనంతరం మీడియా సమావేశంలో విలపించడం వర్గాలకు అతీతంగా అందరినీ కలచివేసింది. ఈ అంశంలో క్రమంగా ఆయనకు మద్దతు పెరుగుతోంది. ఈ ఉదయం చంద్రబాబుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఫోన్ చేసి పరామర్శించారు.

తాజాగా, నటుడు సోనూ సూద్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబుకు ఎదురైన పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఓ దేవాలయం వంటిదని, అటువంటి పవిత్రమైన స్థలంలో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరం అని పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని తెలిపారు.