ఇప్పటివరకు ఎవరికీ దక్కని ఘనత సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కుమార్తె

21-11-2021 Sun 20:29
  • నవంబరు 21న అల్లు అర్హ పుట్టినరోజు
  • దుబాయ్ వెళ్లిన బన్నీ ఫ్యామిలీ
  • ఆతిథ్యమిచ్చిన ఎమ్మార్ ప్రాపర్టీస్
  • అత్యంత ఎత్తయిన భవంతిపై అర్హ బర్త్ డే పార్టీ
Allu Arha celebrates her birthday at world highest building in Dubai
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. నేడు (నవంబరు 21) అల్లు అర్హ పుట్టినరోజు. అయితే, అర్హ పుట్టినరోజు కోసం అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు దుబాయ్ వెళ్లారు. అక్కడి ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా టవర్స్ యాజమాన్యం ఎమ్మార్ ప్రాపర్టీస్ అల్లు ఫ్యామిలీకి అదిరిపోయే ఆతిథ్యమిచ్చింది.

ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్ పై అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఇదొక రికార్డు. ఈ టవర్స్ పై గతంలో ఎలాంటి జన్మదిన వేడుకలు జరగలేదు. తొలిసారిగా ఇక్కడ అల్లు అర్హ పుట్టినరోజు సంబరాలు జరగడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.