CM Jagan: అంబులెన్స్ కు దారివ్వండి... కాన్వాయ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్

CM Jagan convoy makes way for ambulance
షార్ట్స్‌లో చూడండి
సీఎం జగన్ ఇవాళ హైదరాబాదులో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. కాగా, తన కాన్వాయ్ వేగంగా వెళుతుండగా సీఎం జగన్ రోడ్డుపై ఓ అంబులెన్స్ ను గుర్తించారు. వెంటనే వేగం తగ్గించాలని తన కాన్వాయ్ అధికారులను ఆదేశించారు. ఆ అంబులెన్స్ కు దారివ్వాలని సూచించారు. దాంతో ఆ అంబులెన్స్ ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన ముందుకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
Go Back to Shorts
CM Jagan
Convoy
Ambulance
Hyderabad

More Telugu News