పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన కేసీఆర్, జగన్

21-11-2021 Sun 15:19
  • సీఎం జగన్ ఓఎస్డీ కుమారుడితో పోచారం మనవరాలి వివాహం
  • స్నిగ్ధ వెడ్స్ రోహిత్ రెడ్డి
  • శంషాబాద్ వీఎన్ఆర్ ఫార్మ్స్ లో వివాహ వేడుక
  • పక్కపక్కనే కూర్చుని పెళ్లి వేడుక తిలకించిన సీఎంలు
Jagan and KCR attends Telangana speaker Pocharam Srinivas Reddy grand daughter marriage
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలు స్నిగ్ధ వివాహం నేడు శంషాబాద్ లో రోహిత్ రెడ్డితో ఘనంగా జరిగింది. రోహిత్ రెడ్డి ఎవరో కాదు... ఏపీ సీఎం జగన్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడే. ఈ వివాహ మహోత్సవానికి జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. వధూవరులు స్నిగ్ధ, రోహిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్ వేదికగా నిలిచింది. కాగా, పెళ్లి వేడుక సందర్భంగా కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కనిపించింది.