Padugupadu: పడుగుపాడు వద్ద గాల్లో వేళ్లాడుతున్న పట్టాలు... విజయవాడ-చెన్నై మధ్య రైళ్లు నిలిపివేత

Trains services halted between Vijayawada and Chennai after track washed away at Padugupadu
  • నెల్లూరు జిల్లాలో జలవిలయం
  • పెన్నా ఉగ్రరూపం
  • ఎగువ నుంచి పోటెత్తిన వరద నీరు
  • పడుగుపాడు వద్ద దెబ్బతిన్న రెండు రైల్వే ట్రాక్ లు
వాయుగుండం ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. రెండ్రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, వాగులు వంకలు, చెరువులు, జలాశయాలు వరదతో పోటెత్తాయి. దాంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో బీభత్సం నెలకొంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో జలవిలయం చోటుచేసుకుంది. పెన్నా ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటికే కోవూరు వద్ద జాతీయ రహదారి తెగిపోయింది.

ఇక శనివారం రాత్రి నెల్లూరు జిల్లాలోని పడుగుపాడు వద్ద రైలు పట్టాలపై నీళ్లు చేరాయి. కొద్ది వ్యవధిలోనే వరద నీరు ట్రాక్ ను కమ్మేసింది. దాంతో విజయవాడ-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఎగువనుంచి నీటి ప్రభావం ఉద్ధృతంగా రావడంతో పట్టాల కింద ఉన్న కంకర కొట్టుకుపోయి కేవలం గాల్లో వేళ్లాడుతూ పట్టాలు మాత్రం మిగిలాయి. పడుగుపాడు వద్ద ఉన్న మూడు ట్రాక్ ల్లో 2 ట్రాక్ లు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ ల పునరుద్ధరణ పనులు అత్యవసర ప్రాతిపదికన జరుగుతున్నాయి.
Padugupadu
Railway Track
Flood
Vijayawada
Chennai

More Telugu News