ఫ్యామిలీతో ఎయిర్​ పోర్టులో ఎన్టీఆర్​.. స్విట్జర్లాండ్ కు పయనం

21-11-2021 Sun 14:30
  • భార్యాకుమారులతో కలిసి స్విట్జర్లాండ్ టూర్
  • రిలాక్స్ అయ్యేందుకు విదేశీ పర్యటన
  • శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్యామిలీతో ఉన్న ఫొటోలు వైరల్
  • రాగానే కొరటాల శివ సినిమా షూటింగ్
NTR Flies To Switzerland With Family
ఇటు సినిమా షూటింగులు, అటు బుల్లితెర రియాలిటీ షోలు.. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో బాగా బిజీబిజీగా ఉన్నారు. బాగా అలసిపోయిన ఆయన.. కొంచెం బ్రేక్ ఇచ్చారు. తన ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అయ్యేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారు. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి టైం స్పెండ్ చేసేందుకు, తనను తాను రిలాక్స్ చేసేందుకు విదేశీ టూర్ కు పయనమయ్యారు.

ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఉన్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వెంటనే ఆయన కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో తలమునకలవుతారు.