వరద బాధితులకు సాయం చేయండి.. టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన చంద్రబాబు

21-11-2021 Sun 11:54
  • సమన్వయకర్తలుగా మాజీ మంత్రులు
  • ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పరసా రత్నంలకు బాధ్యతలు
  • ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచన
Nara Chandrababu Instructs TDP Cadre To Help Flood Victims
ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా టీడీపీ శ్రేణులకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమన్వయకర్తలను నియమించారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పరసా రత్నం, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లకు ఆ బాధ్యతలను అప్పగించారు.

వరదల్లో సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులకు సాయమందించాలని ఆయన సూచించారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు.