టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించిన సూపర్ స్టార్ రజనీకాంత్

21-11-2021 Sun 10:04
  • ఈ ఉదయం చంద్రబాబుకు ఫోన్
  • అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారం
  • భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకోవడంపై పలువురు విమర్శలు
Rajinikanth called to TDP Chief Chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా దూషించడంపై రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.

కాగా, చంద్రబాబు భార్యను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కుటుంబానికి అండగా నిలుస్తున్న పలువురు జాతీయ నేతలు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొంటున్నారు.