భారీ వర్షాలకు అర్థరాత్రి కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్!

21-11-2021 Sun 09:42
  • వెలిగల్లు జలాశయం గేట్లు ఎత్తివేయడంతో పోటెత్తిన వరద నీరు
  • రెండు రోజులుగా ప్రమాదకరంగా ఉన్న వంతెన
  • అనంతపురం, కడప మధ్య నిలిచిపోయిన రాకపోకలు
  • బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు నెలరోజులకు పైగా పట్టే అవకాశం
Bridge on Papagni river collapsed
కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన గత అర్ధరాత్రి కుప్పకూలింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఏత్తివేయడంతో వరద నీరు పోటెత్తింది. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన నిన్న సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాకపోకలు పునరుద్ధరించేందుకు నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.