తెలంగాణలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ

21-11-2021 Sun 08:23
  • తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
  • హైదరాబాద్‌లో నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వర్షం
  • జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
Heavy Rains predicted in Telangana in 48 hours
వచ్చే 48 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైద‌రాబాద్ , రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల్లో ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా, నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో నిన్న ఉదయం నుంచి చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది. జ‌గ‌ద్గిరిగుట్ట ప‌రిధిలో అత్య‌ధికంగా 4.5 మిల్లీమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది.