టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం

21-11-2021 Sun 08:04
  • నటి ముంబై నివాసంలోని 12వ అంతస్తులో ప్రమాదం
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • లక్నోలో షూటింగులో ఉన్న రకుల్
Fire Accident in Bollywood Actress Rakul Preet Singh Mumbai building
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ముంబై నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆమె నివసించే భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

షూటింగ్ నిమిత్తం రకుల్ ప్రస్తుతం లక్నోలో ఉన్నారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ రహస్యాన్ని బయటపెట్టారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించారు. త్వరలోనే తామిద్దరం పెళ్లాడబోతున్నట్టు తెలిపారు.