ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలామంది నేతలు ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే: ఎమ్మెల్యే సీతక్క

20-11-2021 Sat 22:00
  • ఏపీ రాజకీయాలపై సీతక్క స్పందన
  • చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు వెల్లడి
  • వారి ఇళ్లలో కూడా మహిళలు ఉంటారంటూ కామెంట్
  • రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని వ్యాఖ్యలు
Seethakka responds on AP political developments
ఏపీ అసెంబ్లీ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు సరికాదని అన్నారు. వ్యాఖ్యలు చేసేవారి ఇళ్లలో కూడా మహిళలు ఉంటారని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.

ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలామంది నేతలు గతంలో టీడీపీలో ఉన్నవారేనని అన్నారు. మొన్నటివరకు టీడీపీలో ఉండి ఇప్పుడు వ్యక్తిగత లాభాల కోసం విమర్శలు చేయడం జుగుప్సాకరం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఒకరిద్దరు మహిళా ఎమ్మెల్యేలు అసభ్యంగా విమర్శిస్తున్నారని సీతక్క అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని, వ్యక్తిగత విలువలను కాపాడుకోవాలని సూచించారు.