చంద్రబాబు ఏడ్చాడని తాను కూడా ఏడ్చిన చిన్నారి... వీడియో వైరల్

20-11-2021 Sat 20:19
  • అసెంబ్లీలో పరిణామాలపై చంద్రబాబు మనస్తాపం
  • తీవ్ర మనోవేదనతో ప్రెస్ మీట్
  • రెండు చేతుల్లో ముఖం దాచుకుని విలపించిన చంద్రబాబు
  • బాబు రోదనతో దిగ్భ్రాంతికి గురైన ప్రజలు
Girl crying after seen Chandrababu crying in TV
అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో ఒక్కసారిగా రెండు చేతుల్లో ముఖం దాచుకుని విలపించారు. కనీసం మాటలు కూడా రాని స్థితిలో ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. గతంలో చంద్రబాబును ఆ స్థితిలో ఎప్పుడూ చూడని ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు, చంద్రబాబు తీవ్ర భావోద్వేగాలకు గురికావడానికి అసెంబ్లీలో ఏం జరిగింటుందన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కాగా, సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. నిన్న చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించడం చూసి ఓ చిన్నారి కూడా ఏడ్వడం ఆ వీడియోలో కనిపించింది. చంద్రబాబు ఏడుస్తున్నాడు అంటూ ఆ బాలిక తాను కూడా రోదించింది. తల్లిదండ్రులు ఎంత సముదాయించినా ఆ బాలిక ఏడుపు ఆపలేదు. చంద్రబాబుకు ఫోన్ చేస్తానంటూ ఆ బాలిక తండ్రి ఎంత నచ్చచెప్పినా ఏడుస్తూనే ఉంది. చంద్రబాబును ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయిన చిన్నారి కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనైనట్టు వీడియో చూస్తే అర్థమవుతుంది.