హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

20-11-2021 Sat 19:52
  • తీరందాటిన వాయుగుండం
  • బలహీనపడి అల్పపీడనంగా మారిన వైనం
  • తెలంగాణపైనా ప్రభావం
  • ఈ సాయంత్రం హైదరాబాదులో జల్లులు
IMD issues yellow alert for Hyderabad and few districts in Telangana
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాదులో నేటి సాయంత్రం జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.