బాలయ్య టాక్ షోకి రానున్న రోజా?

20-11-2021 Sat 18:37
  • 'అన్ స్టాపబుల్' షోకి మంచి క్రేజ్
  • మోహన్ బాబుతో జరిగిన ఫస్టు ఎపిపోడ్
  • సెకండ్ ఎపిసోడ్ నానితో
  • త్వరలో రోజా రానుందనే టాక్
Unstoppble UpComing Episode with Roja
'ఆహా' కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె' అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ఫస్టు ఎపిసోడ్ ను మోహన్ బాబుతో చేశారు. ఆయన వ్యక్తిగతమైన .. వృత్తిపరమైన .. రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలు ఈ వేదికపై ఆవిష్కరించబడ్డాయి. ఈ టాక్ షో ఒక రేంజ్ లో జనానికి కనెక్ట్ అయింది.

ఆ తరువాత ఎపిసోడ్ ను నానితో చేశారు. స్టేజ్ పైనే చిన్న చిన్న గేమ్స్ ప్లాన్ చేసినా, ఈ ఎపిసోడ్ అంతగా పేలలేదు. బాలయ్య వైపు నుంచి కొంత ఎమోషన్ ను కనెక్ట్ చేయటం వలన, కొంతలో కొంతవరకూ ఆ ఎపిసోడ్ కి హెల్ప్ అయింది. ఇక త్వరలో ఈ షోలో రోజా కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇటీవల రోజా బర్త్ డే కి గ్రీటింగ్స్ చెప్పిన బాలయ్య .. ఈ షో గురించి ప్రస్తావించగా, తాను వస్తానని రోజా చెప్పారట. త్వరలోనే ఆమెతో టాక్ షో ఉండొచ్చని అంటున్నారు. రాజకీయల సంగతి అటుంచితే, ఇద్దరి కాంబినేషన్లో 'భైరవద్వీపం' .. 'బొబ్బిలి సింహం' వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలాగే ఉంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ రభసను పక్కన పెట్టేసి రోజా ఎప్పుడు వస్తుందో చూడాలి.