చరణ్ .. శంకర్ సినిమా కోసం 40 కోట్ల సెట్!

20-11-2021 Sat 17:47
  • సెకండ్ షెడ్యూల్ లో చరణ్ సినిమా
  • రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేసిన శంకర్
  • కథానాయికగా కియారా అద్వాని
  • ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. సునీల్    
Charan and Shankar movie update
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను పూర్తిచేసిన చరణ్, అంతకి ఎంతమాత్రం తగ్గకుండా శంకర్ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సౌత్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలలో ఇది ఒకటి. ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు.

సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15వ తేదీన మొదలుపెట్టారు. చరణ్ - కియారా అద్వాని కాంబినేషన్లోని కొన్ని రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకర్తిస్తున్నారు. ఇక్కడ ఒక భారీ సెట్ ను వేయిస్తున్నారట. అందుకోసం 40 కోట్లను కేటాయించినట్టుగా చెప్పుకుంటున్నారు.

 'శివాజీ' సినిమాలోని 'వాజీ వాజీ .. 'అనే పాట తరహాలో డిజైన్ చేసిన పాట కోసం ఈ సెట్ వేయిస్తున్నారని అంటున్నారు. కేవలం పాట కోసం కాకపోయినా మరి కొన్ని సీన్స్ ను కూడా ఇక్కడ ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఒక భారీ సెట్ మాత్రం రెడీ అవుతోంది. ఇక అందులో ఏం చేస్తారు? ఏం తీస్తారు? అనేది వెయిట్ చేయాలి. ఈ సినిమాలో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.