విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

20-11-2021 Sat 16:52
  • టీ20 ఫార్మాట్లో 29 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ
  • నిన్నటి మ్యాచ్ లో 29వ అర్ధ శతకాన్ని పూర్తి చేసిన రోహిత్
  • రేపు కోల్ కతాలో న్యూజిలాండ్ తో చివరి వన్డే
Rohit Sharma levels record of Kohli
టీ20 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీకి చెందిన ఒక రికార్డును ప్రస్తుత టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ సమం చేశాడు. టీ20 ఫార్మాట్ లో ఇప్పటి వరకు కోహ్లీ 29 అర్ధ శతకాలు చేశాడు. నిన్న న్యూజిలాండ్ లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇది పొట్టి ఫార్మాట్లో రోహిత్ కు 29వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.

దీంతో కోహ్లీ రికార్డును రోహిత్ సమం చేశాడు. అయితే 29 హాఫ్ సెంచరీలు చేయడానికి రోహిత్ 118 మ్యాచ్ లు తీసుకుంటే... కోహ్లీ కేవలం 91 మ్యాచ్ లు మాత్రమే తీసుకున్నాడు. న్యూజిలాండ్ తో చివరి టీ20 రేపు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగనుంది. అనంతరం నవంబర్ 25 నుంచి రెండు జట్లు రెండు టెస్టుల సిరీస్ లో తలపడతాయి.