కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగింది: జగ్గారెడ్డి

20-11-2021 Sat 16:24
  • నిన్నటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర పరిణామాలు
  • తన అర్ధాంగిని దూషించారన్న చంద్రబాబు
  • అసెంబ్లీ నుంచి వాకౌట్
  • సీఎం అయిన తర్వాతే వస్తానని శపథం
  • జగన్ చొరవ తీసుకోవాలన్న జగ్గారెడ్డి
Jagga Reddy opines on AP politics
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నిన్న జరిగిన పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి స్పందించారు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు ప్రశాంతంగా కొనసాగేలా జగన్ చొరవ తీసుకోవాలని సూచించారు. పగలు, ప్రతీకారాల వరకు వెళ్లడం ఏమంత క్షేమదాయకం కాదని జగ్గారెడ్డి హితవు పలికారు. కొడాలి నాని తన మాటతీరు మార్చుకుంటే బాగుంటుందని, నాడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడున్నాడు? అని ప్రశ్నించారు.