ఈ పుస్తకం జీవితానికి ప్రేమలేఖ వంటిది: నాగచైతన్య

20-11-2021 Sat 16:01
  • గ్రీన్ లైట్స్ పుస్తకం చదివానని చైతూ వెల్లడి
  • గ్రీన్ లైట్స్ రచయిత మాథ్యూ మెక్ కొనాఘేకు కృతజ్ఞతలు
  • ఆ పుస్తకం తనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడి
  • 45 రోజుల తర్వాత సోషల్ మీడియాలో చై సందడి
Naga Chaitanya opines on Green Lights book
సమంతతో విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత నాగచైతన్య చాలారోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. 45 రోజుల అనంతరం ఆయన మళ్లీ అభిమానులను పలకరించారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. సుప్రసిద్ధ రచయిత మాథ్యూ మెక్ కొనాఘే రచించిన గ్రీన్ లైట్స్ అనే పుస్తకంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రీన్ లైట్స్ పుస్తకం జీవితానికి ప్రేమలేఖ వంటిదని నాగచైతన్య అభివర్ణించారు.

"మీ జీవన ప్రస్థానాన్ని పంచుకున్నందుకు థాంక్యూ మెక్ కొనాఘే" అంటూ వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం చదవడం ద్వారా తన జీవితంలోనూ కాంతిరేఖలు పరుచుకున్న అనుభూతిని పొందానని పేర్కొన్నారు. "ఈ పుస్తకం చదివిన అనంతరం మీరంటే ఎంతో గౌరవం కలుగుతోంది సర్" అంటూ స్పందించారు.