ఎమ్మెల్సీ కరీమున్నీసా కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

20-11-2021 Sat 15:31
  • వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం
  • నిన్న గుండెపోటుకు గురైన వైనం
  • ఏరియల్ సర్వే ముగించుకుని విజయవాడ వచ్చిన సీఎం
  • కరీమున్నీసా భౌతికకాయానికి నివాళులు
CM Jagan paid tributes to MLC Karimunnisa
వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా నిన్న హఠాన్మరణం చెందడం తెలిసిందే. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. ఇటీవలే ఆమె ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్నారు. అయితే విజయవాడలో ఆమె గతరాత్రి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.  

కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ముగించుకుని వచ్చిన సీఎం జగన్... విజయవాడలో కరీమున్నీసా నివాసానికి వెళ్లారు. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఆయన... తీవ్ర విషాదంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు.