నేను ఏమన్నానని... బాబు గారు ఏడుస్తూ నిష్క్రమించారు?: అంబటి రాంబాబు

20-11-2021 Sat 15:19
  • భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆవేదన
  • రగిలిపోతున్న నందమూరి కుటుంబ సభ్యులు
  • వైసీపీ నేతలకు తీవ్ర హెచ్చరికలు
  • అంబటి రాంబాబు ట్వీట్
Ambati Rambabu responds via twitter
తన అర్ధాంగి నారా భువనేశ్వరిని అసెంబ్లీలో వైసీపీ నేతలు దూషించారంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, తాను సీఎం అయ్యేంత వరకు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టబోనని శపథం చేయడం తెలిసిందే. ఆపై మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. బాబు ఆవేదన నందమూరి కుటుంబ సభ్యులను కుదిపేసింది.

నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నందమూరి కుటుంబ సభ్యులు వైసీపీ నేతలపై మండిపడ్డారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ హద్దులు దాటారంటూ నందమూరి రామకృష్ణ అన్నారు.

ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబు ట్విట్టర్ లో స్పందించారు. "నేను ఏమన్నానని... బాబు గారు ఏడుస్తూ నిష్క్రమించారు? అర్థమైతే మీరైనా చెప్పండి" అంటూ వ్యాఖ్యానించారు.