రైల్వే ట్రాక్ పై బాంబు పేల్చిన దుండగులు

20-11-2021 Sat 14:18
  • ఝార్ఖండ్ ధన్ బాద్ డివిజన్ లో ట్రాక్ ను పేల్చివేసిన దుండగులు
  • పట్టాలు తప్పిన లోకో రైలు
  • దర్యాప్తుకు ఆదేశించిన రైల్వే శాఖ
Unknown persons blasts railway track
ఝార్ఖండ్ లో సంఘ విద్రోహశక్తులు చెలరేగిపోయారు. ఈ తెల్లవారుజామున రాష్ట్రంలోని ధన్ బాద్ డివిజన్ లో బాంబు పేలుడుకు దుండగులు పాల్పడ్డారు. ఈ పేలుడు వల్ల ట్రాక్ దెబ్బతింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

దుండగులు కావాలనే ట్రాక్ ను పేల్చి వేశారని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధన్ బాద్ డివిజన్ లో లోకో పట్టాలు తప్పిందని తెలిపింది. ఈ పేలుడు వల్ల ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు.

మరోవైపు ఈ పేలుడుపై రైల్వే శాఖ అత్యున్నత దర్యాప్తుకు ఆదేశించింది. సంబంధిత అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ పేలుడు గర్వా రోడ్-బర్కానా సెక్షన్ మధ్య చోటు చేసుకుంది.