వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

20-11-2021 Sat 13:46
  • గన్నవరం నుంచి కడపకు
  • అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వరద ప్రాంతాల సర్వే
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న పెన్నా నది
CM YS Jagan Aerial Survey In Flood Affected Areas
ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేసి వరద పరిస్థితులను తెలుసుకుంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు.

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాని మోదీతో శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు. కాగా, నెల్లూరులో పెన్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చెయ్యేరు నది నుంచి వస్తున్న భారీ వరదతో పెన్నా ఉగ్రరూపం దాల్చింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.