హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఒకదానినొకటి ఢీకొన్న 8 కార్లు

20-11-2021 Sat 11:43
  • లారీ అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేసిన కారు డ్రైవర్
  • అదుపు తప్పి ఢీకొన్న వెనుక ఉన్న కార్లు
  • కాసేపు ట్రాఫిక్ జాం.. క్లియర్ చేసిన పోలీసులు
Cars piled up in a mishap at ORR
హైదరాబాద్ శివారుల్లోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం 8 కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. అక్కడున్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ఓ లారీ అకస్మాత్తుగా అడ్డు రావడంతో వేగంగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.

వెంటనే వెనుక వస్తున్న మరిన్ని కార్లు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాయి. ప్రమాదంలో అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంతో ఓఆర్ఆర్ పై కాసేపు ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్లను పక్కకు తీసి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.