ఇండియాలో మరోసారి 10 వేలకు పైగా కరోనా కేసుల నమోదు

20-11-2021 Sat 11:33
  • 24 గంటల్లో 10,302 కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 267 మంది మృతి
  • కేరళలో సగానికి పైగా కేసుల నమోదు
India reports 10302 new cases
ఇండియాలో కరోనా కేసులు నిలకడగా నమోదవుతున్నాయి. నిన్న మరోసారి 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,72,863 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 10,302 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 267 మంది మృతి చెందారు. ఈ కేసుల్లో సగానికి పైగా కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో 5,754 కేసులు నమోదు కాగా... 49 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3.45 కోట్లకు సమీపంలోకి వచ్చాయి. 4.65 లక్షలకు మరణాలు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,24,868గా ఉంది. నిన్న 11,787 మంది కోలుకున్నారు. మరోవైపు నిన్న 51,59,931 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 115 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.