రెండు ముహూర్తాలు చెప్పేసిన 'బంగార్రాజు'

20-11-2021 Sat 10:53
  • నాగార్జున నుంచి 'బంగార్రాజు'
  • షూటింగు దశలో సినిమా
  • ఈ నెల 22వ తేదీన నాగ్ ఫస్టులుక్
  • 23వ తేదీన టీజర్ రిలీజ్    
bangarraju first look on 22nd November
నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. చైతూ .. కృతి శెట్టి జంటగా కనిపించనున్నారు. కృతి శెట్టి పోషిస్తున్న 'నాగలక్ష్మి' పాత్రకి సంబంధించిన లుక్ ను రీసెంట్ గా వదిలారు. ఆమె ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పల్లెటూరి అందమంతా ఆమెలోనే ఉందా అనిపించింది.

ఇక 'బంగార్రాజు' పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5:22 నిమిషాలకి విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలే సమయాన్ని కూడా చెప్పేశారు. ఈ నెల 23వ తేదీన 10:23 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రెండు ముహూర్తాలను ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు.

'సోగ్గాడే  చిన్నినాయనా' సినిమాలో రమ్యకృష్ణ తలచుకోగానే ఆత్మగా పైలోకంలో ఉన్న నాగార్జున భూలోకానికి వచ్చేస్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ సారి మాత్రం స్వర్గలోకంలో నాగార్జున చేసే రచ్చ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఆయన సరసన నాయికగా రమ్యకృష్ణ పేరు వినిపిస్తోంది.