మనసు మార్చుకున్న 'అఖండ' టీమ్!

20-11-2021 Sat 10:22
  • విభిన్నమైన కథాంశంతో 'అఖండ'
  • హైదరాబాద్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్
  • శిల్పకళావేదిక ఫిక్స్ అంటూ టాక్
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా రిలీజ్
Akhanda movie update
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి 'అఖండ' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ కలిగిన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది.

ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీన గానీ .. 28వ తేదీన గాని వైజాగ్ లో జరపాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడ భారీ వర్షాలతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ .. ఆ ప్రభావం నుంచి వాళ్లు బయటపడటానికి కొంత సమయం పడుతుంది.

అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోనే శిల్పకళావేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు. మరో కీలకమైన పాత్రను జగపతిబాబు పోషించారు..