Karimunnisa: వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా హఠాన్మరణం

  • గుండెపోటుతో మృతి చెందిన కరీమున్నీసా
  • నిన్న శాసనమండలి సమావేశాలకు హాజరైన వైనం
  • కరీమున్నీసా మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి
YSRCP MLC Karimunnisa passes away

వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి చెందారు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. విజయవాడకు చెందిన ఆమె ఈ ఏడాది మార్చిలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నిన్న శాసనమండలి సమావేశానంతరం ఆమె ఇంటికి వచ్చారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతీనొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి ఆమె పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. ఆమెకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. కరీమున్నీసా హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైసీపీ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News