South Central Railway: తడ-సూళ్లూరుపేట మార్గంలో ప్రమాదకర స్థాయిలో వరదనీరు.. పలు రైళ్ల రద్దు

  • ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు
  • 12 రైళ్లు దారి మళ్లింపు
  • చెన్నై నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రద్దు
South Central Railway Cancelled several trains due to heavy rains

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అతలాకుతలం అవుతుండడంతో అటువైపుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. నెల్లూరు జిల్లా తడ-సూళ్లూరుపేట మధ్య వరదనీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

తిరుపతి-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-ముంబై సీఎస్‌టీ, గుంతకల్-రేణిగుంట, బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - బిట్రగుంట, విజయవాడ-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-విజయవాడ రైళ్లను నేడు రద్దు చేశారు. అలాగే, చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్, కాచిగూడ-చెంగల్పట్టు, ఎల్‌టీటీ ముంబై-చెన్నై సెంట్రల్, సీఎస్‌టీ ముంబై-నాగర్‌సోల్, మధురై-ఎల్‌టీటీ ముంబై, చెంగల్పట్టు-కాచిగూడ, చెన్నై సెంట్రల్-ఎల్‌టీటీ ముంబై రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

అలాగే, త్రివేండ్రం-షాలిమర్, తిరుపతి-హెచ్.నిజాముద్దీన్, కాచిగూడ-మంగళూరు, చెన్నై సెంట్రల్-హౌరా, చెన్నై సెంట్రల్-విజయవాడ తదితర 12 రైళ్లను దారి మళ్లించారు.

More Telugu News