నేను, భువనేశ్వరి విలువలతో పెరిగాం... దీన్ని అంగీకరించలేం: పురందేశ్వరి

19-11-2021 Fri 21:24
  • అసెంబ్లీలో తన భార్యను కించపరిచారన్న చంద్రబాబు
  • ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతం
  • ఈ వ్యవహారంపై స్పందించిన పురందేశ్వరి
  • తన మనసు గాయపడిందని వెల్లడి
Purandeswari opines in Bhuvaneswari issue
ఏపీ అసెంబ్లీలో తన అర్ధాంగి భువనేశ్వరిని దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రెస్ మీట్ లో కన్నీటి పర్యంతం కావడం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.

అసెంబ్లీలో తన సోదరి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారన్న ఆరోపణలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. "భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇవాళ జరిగిన ఘటనతో నా మనసు నిజంగా గాయపడింది. అక్కాచెల్లెళ్లుగా మేం ఎన్నో విలువలతో పెరిగాం. ఈ ఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేం" అని పేర్కొన్నారు.

ఆడపడుచులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం: రఘురామ

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అర్ధాంగిని అవమానిస్తూ అధికారపక్ష నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఆడపడుచులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు.