తెలంగాణలో మరో 137 మందికి కరోనా నిర్ధారణ

19-11-2021 Fri 20:53
  • గత 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 48 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,657 మందికి చికిత్స
Telangana corona bulletin
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. వికారాబాద్, నిర్మల్, ములుగు, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జనగామ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 173 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,74,318 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,682 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,657 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,979కి పెరిగింది.