కివీస్ తో రెండో టీ20లో టాస్ నెగ్గిన టీమిండియా

19-11-2021 Fri 19:17
  • రాంచీ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • ధాటిగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు
  • 3 ఓవర్లలో 29 రన్స్
Team India won the toss
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. రాంచీ ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 19, డారిల్ మిచెల్ 10 పరుగులతో ఆడుతున్నారు.

ఈ సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో రోహిత్ సేన నెగ్గిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ చేజిక్కించుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.