'ఆచార్య' రిలీజ్ రోజునే సూర్య మూవీ!

19-11-2021 Fri 18:33
  • సూర్య ఖాతాలో రెండు హిట్లు
  • సెట్స్ పై 'ఇతరుక్కుమ్ తునిందవన్' 
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ 
  • ఫిబ్రవరి 4వ తేదీన విడుదల  
Surya and pandiraj movie update
సూర్య కొంతకాలంగా యథార్థ సంఘటనలకు .. బయోపిక్ లకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' రెండింటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలను కూడా ఆయన థియేటర్లలో దింపకుండా, ఓటీటీలో విడిచిపెట్టాడు. ఒక రకంగా ఇది ఆయన అభిమానులకు అసంతృప్తిని కలిగించింది.

అందువలన తన తదుపరి సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతో సూర్య ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 'ఇతరుక్కుమ్ తునిందవన్' అనే సినిమాను చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా అలరించనుంది.

సత్యరాజ్ .. శరణ్య ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాను, ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఆ రోజున చిరంజీవి 'ఆచార్య' భారీ స్థాయిలో విడుదల కానుంది. సూర్య తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున రిలీజ్ చేస్తుంటాడు. అయితే ఈ సారి తెలుగులో ఆయన సినిమా గట్టిపోటీనే ఎదుర్కోవడానికి సిద్ధపడిందన్నమాట!