షరతులు వర్తిస్తాయని చెప్పిన శ్రుతి హాసన్!

19-11-2021 Fri 18:02
  • 'క్రాక్'తో హిట్ కొట్టిన శ్రుతి హాసన్
  • గోపీచంద్ మలినేనితో మూడో సినిమా
  • త్వరలోనే సెట్స్ పైకి
  • షూటింగు దశలో 'సలార్'  
Gopichand Malineni movie update
ఆ మధ్య తెలుగు .. తమిళ .. హిందీ సినిమాలపై ఫోకస్ తగ్గించిన శ్రుతి హాసన్, ఇప్పుడిప్పుడే మళ్లీ నెమ్మదిగా కుదురుకుంటోంది. తెలుగులో 'క్రాక్' వంటి పెద్ద హిట్ పడటం ఆమెకి బాగా కలిసొచ్చింది. ఆ తరువాత ఆమె ప్రభాస్ జోడీగా 'సలార్' అనే పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమా చేస్తూనే ఆమె బాలకృష్ణ తదుపరి సినిమాకి ఓకే చెప్పింది. ఒక వైపున ప్రభాస్ సరసన చేస్తూ మరో వైపున బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ పక్కన ఆడిపాడటానికి ఆమె అంగీకరించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. గోపీచంద్ మలినేని తనకి 'బలుపు' .. 'క్రాక్' వంటి భారీ హిట్లు ఇవ్వడం వల్లనే ఆమె ఈ సినిమాకి అంగీకరించిందని అంటున్నారు.

గోపీచంద్ మలినేని ఈ సినిమా కోసం స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ దొరక్క చాలా ఇబ్బందిపడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన మళ్లీ ఆమె దగ్గరికి వెళ్లాడు. అయితే శ్రుతి హాసన్ చాలా షరతులు పెట్టిందట. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండకూడదు అనేది వాటిలో ఒకటి. అన్నిటికీ అంగీకరించే గోపీచంద్ మలినేని ఓకే అనేశాడట. తనని సీనియర్ హీరోయిన్స్ కేటగిరిలోకి పంపించవద్దనేది ఆమె రిక్వెస్ట్ అన్నమాట.