విజయ్ రోల్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసిన వంశీ పైడిపల్లి!

19-11-2021 Fri 17:35
  • వరుస హిట్లతో విజయ్
  • షూటింగు దశలో 'బీస్ట్'
  • నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో
  • నిర్మాతగా దిల్ రాజు
  • కథానాయికగా కియారా
Vamsi Paidipalli movie update
కొంతకాలంగా విజయ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలతో .. భారీ వసూళ్లతో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'బీస్ట్' రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది.

ఈ సినిమా తరువాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది.

ఈ సినిమాలో విజయ్ ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటాడట. తన మనసుకి నచ్చినవారు .. తనని ఆరాధిస్తున్నట్టు .. తన కోసం టైమ్ స్పెండ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందట. అలాంటి ఒక పాత్రలో విజయ్ ని వంశీ చూపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని పేరు కనిపిస్తోంది.