నాగార్జున సినిమాలో 'జాతిరత్నాలు' భామ

19-11-2021 Fri 16:38
  • 'జాతిరత్నాలు'తో ఫరియాకు గుర్తింపు 
  • నాగార్జున 'బంగార్రాజు'లో అవకాశం
  • స్పెషల్ సాంగులో మెరవనున్న ఫరియా  
Faria Abdulla to do special song in Nagarjunas movie
ఆమధ్య వచ్చిన 'జాతిరత్నాలు' సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇందులో కథానాయికగా నటించిన ఫరియా అబ్దుల్లాకు కూడా మంచి గ్లామరస్ తారగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ అక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయడానికి ఎంపికైనట్టు తెలుస్తోంది.

నాగార్జున హీరోగా గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ గా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. నాగలక్ష్మి పాత్రలో తాజాగా విడుదలైన ఆమె గ్లామరస్ లుక్కుకి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.

ఇక ఈ సినిమాలో ఓ మాంచి ఐటం సాంగ్ ఉందట. ఇందుకోసం ఫరియా అబ్దుల్లాను తీసుకున్నట్టు తాజా సమాచారం. మామూలుగానే ఫరియాకు మంచి డ్యాన్సర్ గా పేరుంది. మరి ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగులో ఆమె డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడాలి!