సీఎం జగన్ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండడం సిగ్గుమాలిన చర్య: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

19-11-2021 Fri 15:05
  • అసెంబ్లీ సమావేశాల నుంచి చంద్రబాబు వాకౌట్
  • మళ్లీ సీఎం అయిన తర్వాతే వస్తానని శపథం
  • ప్రెస్ మీట్ లో కన్నీటిపర్యంతమైన చంద్రబాబు
  • ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందన్న గోరంట్ల
Gorantla fires on CM Jagan and YCP leaders
మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు శపథం చేసి, వెళ్లిపోవడం తెలిసిందే. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.  

ఈ క్రమంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ, నీచమైన పదానికి అర్థం వైసీపీ పార్టీ అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడితో కన్నీరు పెట్టించారని మండిపడ్డారు. అసలు, వైసీపీలో విజ్ఞత గల నాయకులు ఉన్నారా? లేక పనికిమాలిన నేతలు మాత్రమే ఉన్నారా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. సీఎం జగన్ వెకిలి నవ్వులు నవ్వుతుండడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని హెచ్చరించారు.