తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించిన టీటీడీ

  • చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
  • తిరుమల, తిరుపతిలో కుండపోత
  • ఘాట్ రోడ్డుపై 13 చోట్ల విరిగిపడిన కొండచరియలు
  • తీవ్రంగా శ్రమించిన టీటీడీ సిబ్బంది
TTD revives second ghat road

భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో నిన్న తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోవడం తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన టీటీడీ ఇంజినీరింగ్ సిబ్బంది కొండచరియల నుంచి రాళ్లు పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేశారు.

ఈ నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలు మొదలయ్యాయి. భారీ వర్షాలకు నిన్న తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక మార్గంలోనే వాహనాలను అనుమతించారు. ఇప్పుడు రెండో ఘాట్ రోడ్డు కూడా తెరుచుకోవడంతో కొండపైకి రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

వాయుగుండం ప్రభావంతో తిరుపతి, తిరుమలలో అతి భారీ వర్షాలు కురవడం తెలిసిందే. తిరుపతి నగరం జలవిలయంలో చిక్కుకుపోగా, తిరుమల కొండపైనా వర్షపు నీరు పోటెత్తింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు రేపు (శనివారం) కూడా సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ వెల్లడించారు.

More Telugu News